కోయ్ కోయ్ సాంగ్ లో ఇంతర్థం వుందా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పాస్టర్ ఎవరో తెలుసా?
'కోయారే కోయారే కోయ్... మామారే చందమామ...కోయ్ కోయ్' ...సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సాంగ్ అర్థమేంటో తెలుసా? ఈ పాట పాడిన పాస్టరే దీని అర్థాన్ని వివరించారు. అదేంటో తెలుసుకుందాం.
koyare koyare koy : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడచూసినా 'కోయారే కోయారే కోయ్' అంటూ ఓ సాంగ్ వినిపిస్తోంది... కామెడీగా స్టెప్పులేస్తతూ ఓ పాస్టర్ కనిపిస్తున్నాడు. ఆ పాట ఏ బాషో తెలీదు... ఈ పాస్టర్ ఎక్కడివారో తెలీదు... కానీ మంచి రిదమ్ తో కూడిన ఆ పాట ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరీముఖ్యంగా ఆ పాస్టర్ పాడే విధానం చాలా సరదాగా వుంది. దీంతో 2024 ఎండిగ్ లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కోయ్ కోయ్ సాంగ్ తెగ వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి ఏ సోషల్ మీడియా మాధ్యామాల్లో చూసినా ఈ కోయ్ కోయ్ సాంగ్ తో పాటు ఆ పాస్టర్ పాడిన మరికొన్ని పాటలు కూడా వైరల్ అవుతున్నారు. చిన్నారుల నుండి పెద్దవారివరకు ఈ పాటలను ఆసక్తిగా వింటున్నారు, పాడుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు... దీన్నిబట్టే ఈ పాటలు ప్రజల్లోకి ఎంతలా వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఈ పాటలు ఏ బాషలో వున్నాయి? అర్థం ఏమిటి? పాడిన ఆ పాస్టర్ ఎక్కడివారు? అనేది తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. వీటిగురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరీ కోయ్ కోయ్ పాస్టర్?
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోయ్ కోయ్ సాంగ్ పాడిన ఆ పాస్టర్ మన తెలంగాణకు చెందినవారే. అతడి పేరు మీసాల గురప్ప. ఖమ్మం జిల్లాలోని మారుమూల అటవీప్రాంతంలోని కుంట గ్రామానికి చెందినవారు. అతడు గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వుండే కోయ జాతికి చెందినవాడు.
గురప్ప తన జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వివరాలను బైటపెట్టాడు. అవి నమ్మశక్యంగా లేకున్నా ఆసక్తికరంగా వున్నారు. మీసాల గురప్ప తండ్రిపేరు ఆంబోతు అంకన్న. అతడు పెద్ద క్షుద్ర మాంత్రికుడు. వందలమంది తాంత్రికులను తయారుచేసాడట.
గురప్ప పుట్టగానే తల్లి చనిపోయింది... ఆమె తమ జాతి నమ్మే దేవున్ని కాకుండా మరో దేవున్ని ఆరాధిస్తోందని చెట్టుకు కట్టేసి కొట్టి చంపారట. ఈ విషయం కాస్త పెద్దయ్యాక తనకు తెలిసిందని ... ఓ దేవుడి కోసం తల్లి ప్రాణాలు వదిలిందంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థమయ్యిందట. ఆ తర్వాత తన ప్రాణాలను కూడా ఆ దేవుడు కాపాడాడు... అందుకే ఆయన మార్గంలో నడుస్తున్నానని గురప్ప తెలిపారు. తన జాతికోసమే కోయ్ కోయ్ పాట రాసినట్లు పాస్టర్ గురప్ప తెలిపారు.
కోయ్ కోయ్ పాటకు అర్థం ఏమిటంటే :
'కోయారే కోయారే కోయ్... బామారే చందమామా.. కోయ్ కోయ్...గోండ్ కోయ్' ఈ పాట వినడానికి చాలా కొత్తగా వుంది. అందుకేనేమో ప్రజలకు అమితంగా నచ్చింది. ట్రోల్ చేస్తున్నారో లేక ఇష్టపడి పాడుతున్నారో తెలీదుగాని సోషల్ మీడియా ఓపెన్ చేస్తేచాలు కోయ్ కోయ్ పాట వినిస్తుంది. ఆ పాటే కాదు పాస్టర్ హావభావాలు, ఫన్నీ డ్యాన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఈ కోయ్ కోయ్ పాట ఏ బాషలో వుంది? ఎలా పుట్టిందో పాస్టర్ గురప్ప వివరించారు. ఈ పాట తన మాతృబాష కోయలో వుందని... దీన్ని తన అడవి జాతికోసమే రాసానని తెలిపారు. ఈ పాట తన కన్నతండ్రి కల, కులస్తుల కలగా పేర్కొన్నాడు. పూర్తిగా వెనబడిన గిరిజన జాతులు దేశంలొ 18 వున్నాయి... అందులో ఒకటే తమ కోయ దొరల జాతి అన్నారు. ఈ జాతి, వీరు వాడే బాష గురించి చాలామందికి తెలియదు... దీన్ని వెలుగులోకి తెద్దామనే ఈ పాటను 40 ఏళ్ల కిందటే రాసానని పాస్టర్ గురప్ప తెలిపారు.
ఈ కోయారే కోయారే సాంగ్ ని తానే స్వయంగా రాసుకున్నానని గురప్ప తెలిపారు. కోయ బాషలో జానపదాలను, ఆడబిడ్డలు పాడుకునే 'రేరేలా రేలా' రాగాన్ని కలిపి ఈ పాటను రూపొందించినట్లు తెలిపారు. అందరూ ఆనందించాలని, సంతోషంగా వుండాలనేదే ఈ పాట సారాంశమని తెలిపారు.
''నేను సంతోషిస్తున్నాను... మీరు కూడా సంతోషంగా వుండండి. నాతో కలిసి డ్యాన్స్ చేయండి. నన్ను బాధలనుండి బైట పడేసిన దేవుడు మీకు కూడా ఆనందాన్ని ప్రసాధిస్తారు. మీ దు:ఖాన్ని సంతోషంగా మార్చేది ఆ యేసుప్రభువే. భార్యాభర్తలు, పిల్లలతో కలిసి ఆనందంగా వుండండి'' అని చెప్పడమే ఈ పాట అర్థమని అన్నారు.
ఇక ఈ పాస్టర్ గురప్ప మరో సాంగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. ''బండి బందురే బండి బందురే... గుడిని జమారే భయ్యా భజన జమారే... చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టండి... జాన్ జగన్ రో... జాన్ జగన్ రో'' అంటూ ఈ పాట సాగుతుంది. దీన్ని ప్రజలను ఉత్సాహపర్చడానికి పాడుతుంటానని... బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు.
కుంటుంబంతో సహా ఆనందంగా వుండండి ... యేసు ప్రభువు మీ కళ్లు తుడిచి ఆనందాన్ని ప్రసాదిస్తారు అని చెప్పడమే తన పాటల అంతరార్థమన్నారు. మీరు నవ్వండి...నవ్వకుండా వుంటేనే రోగాలు వస్తాయి.. నవ్వే సర్వరోగాలకు నివారణ... ఇలా మన ముఖంలో నవ్వు తెప్పించేవారు యేసు ప్రభువే అని పాస్టర్ గురప్ప చెబుతున్నారు.
గురప్ప చెప్పే నమ్మలేని నిజాలు :
ఇక తన జీవితంగురించి గురప్ప కథలు కథలుగా చెబుతున్నారు. ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు. కానీ ఆయన మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా అవన్నీ తన జీవితంలో జరిగాయని చెబుతున్నారు. తన తండ్రితో పాటు కోయజాతి ప్రజలు తనను ఆడపిల్లలకు రక్షకుడిగా పెంచారని... అందువల్లే తనకు 13 ఏళ్ల వయసువరకు పాము విషం ఇచ్చి పెంచారని చెబుతున్నారు. తన నరనరాన విషం నిండి వుందని చెబుతున్నారు.
అడవిలోకి వచ్చి తమ ఆడబిడ్డలను ఇబ్బందిపెడితే తాను వారిని రక్షించేవాడినని... ఆకతాయిలను తన గోటితో గిల్లినా, పంటితో కొరికినా చనిపోయేవారని గురప్ప చెబుతున్నారు. తనలో విషప్రభావం లేకుండా కొన్నిరకాల ఆకుపసరు వేసారని... అందువల్లే తనను విషం ఏం చేయడంలేదని అంటున్నాడు.
తాను అడవిలో వుండగా ఎక్కువగా చెట్లపైనే వుండేవాడినని... ఊడలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణించేవాడినని చెబుతున్నారు.
ఇక తన కుటుంబసభ్యుల ఆసక్తికరమైన పేర్లను అతడు తెలిపాడు. తన పేరు మీసాల గురప్ప, తండ్రి ఆంబోతు అంకన్న, మామలు దున్నపోతుల వీరయ్య, బురుగుల సాంబయ్య, మేనత్త ఏనుగు గంగమ్మ అని తెలిపాడు. ఇవన్ని తమ ఇంటిపేర్లు కావని... అడవిలో తమను గుర్తించేందుకు పెట్టిన పేర్లని ఈ పాస్టర్ వెల్లడించారు.
Content Courtesy : https://telugu.asianetnews.com/gallery/telangana/meet-koya-pastor-gurappa-the-viral-sensation-behind-koy-koy-song-shaking-social-media-akp-sptc8j#image2
For more details, you can watch the with Koya Pastor Meesala Gurappa.
Koya Pastor Meesala Gurappa Exclusive First Interview || Koi Koi Song
Video Courtesy : Dial News: https://www.youtube.com/watch?v=OODh6qJzqrA
Hashtags
#KoyKoySong #PastorGurappa #TeluguViralContent #KoyaTribalSongs #SocialMediaTrend #ViralSongs2024 #TeluguFolkMusic
0 Comments