Yesayya Ninnu Chudalani Aasha




యేసయ్యా.. నిన్నుచూడాలనీ - ఆశ
మెస్సయ్యా.. నిన్ను చేరాలనీ - ఆశ = 2
ఎవరు ఉన్నారు నాకు - ఈ లోకంలో..
ఎవరు నాతోడు రారు - ఈ లోకంలో..
ఇమ్మానుయేలైన - నా దైవం నీవేగా - 2

1. అందరు ఉన్నారనీ - అందరు నావారనీ - 2
తలచితినీ - భ్రమసితినీ - 2
చివరీకి ఒంటరి నేనైతినీ - 2
నా గానం నీవయ్యా - నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా - నా సర్వం నీవయ్యా

2. అంధకారంలో.. అంధురాలు నేనైతెనీ - 2
నినుచూసే - నేత్రములు -2
నాకొసగుమా నజరేయుడా - 2
నా ఆశ నీవయ్యా - నా ధ్యాస నీవయ్యా
నా శ్వాస నీవయ్యా - నా భాష నీవయ్యా

Post a Comment

1 Comments